: మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. మహిళా సాధికారత విషయంలో తమ ప్రభుత్వం పలు కీలక చర్యలకు శ్రీకారం చుడుతోందని ప్రకటించిన ఆయన, సదరు చర్యలకు విపక్షాల మద్దతు కూడా అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలపాలని ఆయన కోరారు.