: కిర్లంపూడిలో మూడు రోజులుగా... ఒక్క పొయ్యి కూడా వెలగలేదట!


అవును... తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో మూడు రోజులుగా ఒక్క పొయ్యి కూడా వెలగలేదట. ఎందుకంటే... కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సొంతూరైన కిర్లంపూడి వాసులు అందరూ సంఘీభావంగా ముద్ద ముట్టడం మానేశారు. ఆ గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల వారు నిరాహార దీక్షలు చేస్తున్న కారణంగా ఏ ఇంటిలోనూ వంటావార్పు జరగడం లేదు. ఒక్క కాపు సామాజిక వర్గానికే కాక గ్రామంలోని ఏ సామాజిక వర్గానికి చెందిన వారికైనా, ఏ సమస్య వచ్చినా ముద్రగడ వేగంగా స్పందిస్తారు. ఈ కారణంగానే ఆయననే తమ నేతగా పరిగణిస్తున్న గ్రామస్థులు మూడు రోజులుగా అన్నం ముద్ద ముట్టకుండా ముద్రగడకు సంఘీభావంగా దీక్షల్లో పాల్గొంటూ ప్లేట్లపై గరిటెలతో శబ్దం చేస్తూ హోరెత్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News