: టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా?... జోరుగా సాగుతున్న చర్చ


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రచారాన్ని హోరెత్తించిన ఆ పార్టీ... టీడీపీ, బీజేపీల మాదిరిగానే ‘గులాబీ’ పార్టీ చేతిలో చావు దెబ్బతింది. ఈ క్రమంలో ఆ పార్టీ గ్రేటర్ చీఫ్ పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్ నిన్న రాజీనామా చేశారు. తాజాగా ఈ అపజయానికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారా? అధికారికంగా ఈ వార్త నిజం కానప్పటికీ, దీనిపై ఆ పార్టీ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ సాగుతోంది. వరంగల్ ఉప ఎన్నికలో పరాజయంతోనే తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన ఉత్తమ్... తాను రాజీనామా చేస్తానని చెప్పినా అధిష్ఠానం ఆయనను వారించింది. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు పార్టీకి మరింత నష్టం కలిగిస్తాయని చెప్పిన అధిష్ఠానం పెద్దలు ఆయన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేయించారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆయన ఎవరి మాట లెక్క చేయకుండా తన పదవికి రాజీనామా చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News