: మూడో రోజుకు చేరిన ముద్రగడ దీక్ష... క్షీణిస్తున్న ముద్రగడ దంపతుల ఆరోగ్యం


కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి మూడో రోజుకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే ముద్రగడ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రానికే ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో వైద్యం చేసేందుకు వచ్చిన డాక్టర్లను ముద్రగడ తిరస్కరించారు. వైద్యులను తన ఇంటిలోపలికి అనుమతించని ముద్రగడ, తలుపులు బిగించుకుని పడుకుండిపోయారు. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఎంతసేపటికీ ముద్రగడ తలుపులు తీయలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు ఎస్పీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీక్ష విరమింపజేసే దిశగా వారు చేసిన యత్నాలు రాత్రి పొద్దుపోయే దాకా కూడా ఫలించలేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాని నేపథ్యంలో దీక్ష విరమణకు ముద్రగడ ఏమాత్రం అంగీకరించడం లేదు.

  • Loading...

More Telugu News