: ముద్రగడ నివాసాన్ని చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్ బలగాలు


తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడ పద్మనాభం నివాసాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. కాపు కులానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం దంపతులను పరామర్శించేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. అదే సమయంలో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో వారికి వైద్య చికిత్స అందించేందుకు వైద్యులను ప్రభుత్వం పంపింది. పరీక్షలు చేయించుకుంటున్న ముద్రగడ, చికిత్సకు మాత్రం అంగీకరించడం లేదు. దీంతో, ముందుగా వారి ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఆయన నివాసాన్ని చుట్టుముట్టాయి. ఈ నేపధ్యంలో వారితో చర్చలు జరిపేందుకు జేసీ సత్యనారాయణ వారి నివాసానికి చేరుకున్నారు. దీనికి నిరాకరించిన ముద్రగడ కుటుంబ సభ్యులు తమ నివాసంలో లైట్లు ఆపేసి, తలుపులు మూసేసుకున్నారు.

  • Loading...

More Telugu News