: వెల్లూరు కళాశాల బస్సుపై పడ్డ గ్రహశకలం...డ్రైవర్ మృతి...భయాందోళనల్లో విద్యార్థులు
తమిళనాడులోని వెల్లూరులోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆకాశంలోంచి భారీ గ్రహశకలం పడింది. సాధారణంగా గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలోనే మండిపోతాయి. అయితే ఆకాశం నుంచి రాలిన ఓ గ్రహశకలం మాత్రం వెల్లూరులోని ఇంజనీరింగ్ కళాశాల బస్సుపై పడింది. దీంతో బస్సు ధ్వంసమైంది. బస్సులో ఉన్న డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గ్రహశకలం కిందపడ్డ సందర్భంగా భారీ శబ్దం వెలువడింది. దీంతో ఇంజనీరింగ్ కళాశాలపై ఆకాశం నుంచి బాంబు వేశారంటూ పుకార్లు షికారు చేశాయి. అనంతరం పేలుడు సంభవించిందని వార్తలు వ్యాపించాయి. అనంతరం ఆకాశం నుంచి కిందపడింది గ్రహశకలం అని, అది బస్సుపై పడడం వల్ల భారీ శబ్దం వచ్చిందని అధికారులు నిర్ధారించారు.