: ఆ నీళ్ల మహిమ... స్నానం చేస్తే ఇక 'గుండు'!


తల స్నానం చేస్తే గుండు కావడమేంటని ఆశ్చర్యంగా ఉందా? బాధితులు కూడా అలానే ఆశ్చర్యపోయిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మధుబని జిల్లాకు చెందిన ఓ గ్రామంలో మహ్మద్ హసీమ్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. తమ ఇంటికి సమీపంలో ఉండే పంపు నుంచి నీరు తెచ్చుకుని, వీరు తల స్నానాలు చేశారు. అనంతరం కొద్దిసేపటికి వారి తలపై దురద ప్రారంభమైంది. మరి కాసేపటికి జట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. ఇలా వారు కాసేపటికే బోడి గుళ్ళతో తయారయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించి, ఆ బోరు పంపును సీజ్ చేశారు. అయితే చాలా కాలంగా ఆ పంపు నీరు వినియోగిస్తున్నామని, ఇలా ఎప్పుడూ జరగలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News