: ముందు సరైన బట్టలు వేసుకో...తరువాత ఇంటర్వ్యూ ఇస్తా: క్రికెటర్ ఆమ్లా


సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఇస్లాంను అనుసరిస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మత విశ్వాసాలను నిష్టగా ఆచరించే ఆమ్లా ఓ టీవీ యాంకర్ కు భారత్ లో షాక్ ఇచ్చాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అంశం ప్రకారం...సఫారీలతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్ సందర్భంగా ముంబైలో యాంకర్ ఆమ్లాను ఇంటర్వ్యూకి పిలిచింది. ప్రశ్నించే ప్రయత్నంలో ఆమె ఉండగా, ఆమెను తేరిపార చూసిన ఆమ్లా, 'ఇంటర్వ్యూ కావాలంటే బట్టలు మార్చుకో, ఒళ్లంతా కప్పి ఉంచే బట్టలు వేసుకుని రా, ఇంటర్వ్యూ ఇస్తా' అని సలహా ఇచ్చాడు. తరువాత ఆమె సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేయగా, వారు ఆమ్లాతో మాట్లాడాలని సూచించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యాంకర్ తన లోనెక్ టాప్, కురచ దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆమ్లా ఆమెతో మాట్లాడాడు.

  • Loading...

More Telugu News