: అదనపు కట్నం అడిగారని వివాహాన్ని రద్దు చేసుకున్న ధీరవనిత
తాజాగా, ఓ యువతి అదనపు కట్నం అడిగిన వరుడి కుటుంబాన్ని నిలదీసి, వివాహాన్ని రద్దు చేసుకుని ధీరత్వాన్ని ప్రదర్శించింది. మధ్యప్రదేశ్ లోని మోహగాన్ పట్టణానికి చెందిన మాల్కాన్ సింగ్ తన కుమార్తె మీనాక్షికి మనీష్ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, ఇంతలో వరుడు మనీష్ తండ్రి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి రెండు లక్షల రూపాయల అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అంతటితో ఆగని ఆయన మీనాక్షి తండ్రిపై చేయిచేసుకున్నారు. దీంతో సహించలేకపోయిన మీనాక్షి వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి, తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్ లో వరుడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది.