: గెలిచామని రిలాక్స్ అవ్వొద్దు: కార్పొరేటర్లతో ఎంపీ అసదుద్దీన్


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన 44 మంది కార్పొరేటర్లతో సమావేశమైన ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసద్దుదీన్ ఒవైసీ పలు సూచనలు చేశారు. ముందుగా గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. గెలిచామని రిలాక్స్ అవ్వొద్దని కర్తవ్యాన్ని బోధించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. పార్టీకి చెడ్డపేరు వచ్చేలా ఎక్కడా ప్రవర్తించొద్దని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News