: చంద్రుడిపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తి ఎడ్గర్ మిచెల్ కన్నుమూత


ప్రముఖ వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. స్వల్ప అస్వస్థతతో రెండు రోజుల కిందట (గురువారం) చనిపోయారని ఆయన కుమార్తె కింబర్లీ మిచెల్ తెలిపారు. 1971 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు అపోలో 14 మిషన్ జరిగింది. ఆ సమయంలో 12 మంది వ్యోమగాములు చంద్రమండలంలో అడుగుపెట్టారు. వారిలో ఆరో వ్యక్తి ఎడ్గర్. ప్రస్తుతం దానికి సంబంధించిన 45వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆయన తుదిశ్వాస విడవడం గమనార్హం. అపోలో 13 వైఫల్యం నుంచి నాసా కోలుకునేలా అలాన్ షెపర్డ్ తో కలసి ఎడ్గర్ ఎంతో కృషి చేశారు. అంతేగాక మనసు, భౌతిక శాస్త్రం, గ్రహాంతరవాసులు అనే అంశాలపై అధ్యయనానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.

  • Loading...

More Telugu News