: జెద్దా యువతిని పెళ్లి చేసుకున్న ఇర్ఫాన్ పఠాన్... మక్కాలో గురువారం ముగిసిన తంతు


టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంటివాడైపోయాడు. సౌదీ అరేబియా నగరం జెద్దాకు చెందిన ముస్లిం యువతి సఫా బేగ్ ను అతడు పెళ్లి చేసుకున్నాడు. ముస్లింలు పరమ పవిత్ర నగరంగా భావించే మక్కాలో ఈ వివాహం మూడు రోజుల క్రితం (గురువారం) జరిగింది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు అతి కొద్ది మంది మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఇర్ఫాన్, బేగ్ ల మధ్య ఏర్పడ్డ పరిచయం... ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కేసింది.

  • Loading...

More Telugu News