: ఉపఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమే: మంత్రి తలసాని


టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరిన వారిలో ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒకరు. తామంతా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మొదటి నుంచి చెబుతున్నానని తలసాని మరోసారి తేల్చి చెప్పారు. చంద్రబాబు తెలంగాణకు అవసరం లేదని ప్రజలు పంపించేశారని వ్యాఖ్యానించారు. సుపరిపాలనను ప్రజలు ఆదరిస్తారనేందుకు తమ గెలుపే నిదర్శనమన్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తలసాని స్పష్టం చేశారు. ఇకనైనా బీజేపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే వాళ్ల నియోజకవర్గాలకైనా వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకురావాలని మంత్రి సవాల్ చేశారు.

  • Loading...

More Telugu News