: అస్త్ర సన్యాసం ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటించారు! తాను ఇకపై ఎన్నికల్లో పోటీచేయబోనని తెలిపారు. గత కొంత కాలంగా తెలంగాణ అంశంపై గళం వినిపిస్తున్న కేకే.. కాంగ్రెస్ గనుక త్వరితగతిన ప్రత్యేక రాష్ట్రంపై తేల్చకుంటే పార్టీ ఎంపీలు ఉద్యమ బాట పడతారని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని కేకే అన్నారు. ఇటీవలే కేకే కాంగ్రెస్ ను వీడతారనే వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన తాజా ప్రకటన చేశారు.