: త్వరలోనే భారత్-పాక్ చర్చలు... పీఓకే అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ ప్రకటన


పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీప్ నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత్-పాక్ ల మధ్య చర్చలు త్వరలోనే జరుగుతాయని ఆయన ప్రకటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీని ఉద్దేశించి నిన్న ఆయన కీలక ప్రసంగం చేశారు. ‘‘భారత్, పాక్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశిస్తున్నా. కాశ్మీర్ సహా అన్ని అంశాలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది. ఉగ్రవాదం సహా అన్ని విషయాల్లోనూ భారత్ కు సహకరించేందుకు మా దేశం సిద్ధంగా ఉంది. ఉగ్రవాదానికి ఎక్కువగా ప్రభావితమైన దేశం పాక్. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని పాక్ కోరుకున్నంతగా ఎవరూ కోరుకోరు. దక్షిణాసియాలో ప్రధానంగా కాశ్మీర్ లో శాంతిని పాక్ కోరుకుంటోంది’’ అని షరీప్ ఆ ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News