: హైదరాబాదును ట్రూలీ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్


హైదరాబాదును ట్రూలీ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఎక్కువ మంది యువకులు ఉన్నారని ఆయన చెప్పారు. గ్రేటర్ లో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యతను వారి భుజాలపై వేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాదును అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో అందరూ కలసి రావాలని ఆయన కోరారు. అన్ని పార్టీల సహకారంతో హైదరాబాదులోని అన్ని ప్రాంతాలు ఉన్నత సౌకర్యాలతో అలరారాలని ఆయన చెప్పారు. ఏడాది కాలంలో అన్నీ అమలు చేయాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. పేదల ఎజెండానే తమ ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ఏడాది కాలంలో పూర్తి చేసి ఇచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News