: అతని రాక టీమిండియాలో విశ్వాసం నింపుతుంది: గవాస్కర్
టీమిండియా టీట్వంటీ జట్టులోకి మహ్మద్ షమీ రావడం జట్టులో విశ్వాసం నింపుతుందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్ మెన్ ను కచ్చితమైన యార్కర్లతో ఇబ్బంది పెట్టగల బౌలర్లలో షమి ఒకడు. అద్భుతమైన గుడ్ లెంగ్త్, స్వింగ్ బంతులతో బ్యాట్స్ మన్ ను ముప్పుతిప్పలు పెట్టగల షమిపై సెలక్టర్లు విశ్వాసముంచడం అభినందనీయమని గవాస్కర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా షమీ జట్టుకు 11 నెలలపాటు దూరమయ్యాడు. షమితో పాటు నేగిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందిన గవాస్కర్ తెలిపాడు. వన్డేలతో 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా, టీట్వంటీల్లో కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయాల్సి రావడం షమీకి అనుకూలాంశమని గవాస్కర్ పేర్కొన్నాడు.