: ‘అమ్మ’ పుట్టినరోజుకు ముందు సామూహిక వివాహాలు
ఈ నెల 24వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన 68వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో 68 జంటలకు ఈరోజు సామూహిక వివాహాలు జరిగాయి. తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కాగా, జయలలిత ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది.