: రేవంత్! నల్లమల్లకెళ్లు...నారాయణా!చెవికోసుకో: టీఆర్ఎస్ కార్యకర్తలు


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందతాండవం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ, గ్రేటర్ పరిధిలో 100 సీట్లను గెలిస్తే, రాజకీయ సన్యాసం చేస్తానన్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి నల్లమల అడవులకు వెళ్లిపోవాలని సూచించారు. అలాగే టీఆర్ఎస్ ఒంటరిగా గెలిస్తే చెవి కోసుకుంటానని చెప్పిన సీపీఐ నేత నారాయణ చెవి కోసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని నేతలు తక్కువ అంచనా వేసినప్పటికీ, ప్రజలు మాత్రం పట్టం కట్టారని వారు పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో హైదరాబాదులో ఉన్న ఆంధ్రా సెటిలర్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడం అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News