: పటాన్ చెరులో కాంగ్రెస్ విజయం... బీజేపీ, టీడీపీ 5 స్థానాల్లో ఆధిక్యం
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి ఓట్ల లెక్కింపులోనే మొదటి విజయం నమోదు చేసుకుంది. పటాన్ చెరు డివిజన్ లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మెట్టు శంకర్ యాదవ్ గెలుపొందారు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీలు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అక్బర్ బాగ్ నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు 9 స్థానాల్లో గెలవగా, పలు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో గత మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.