: ఇషాంత్, భువీ, ఉమేష్ లకు షాకిచ్చిన బీసీసీఐ
టీమిండియా సీనియర్ బౌలర్లకు బీసీసీఐ షాకిచ్చింది. గత కొన్నేళ్లుగా ఎంత విఫలమైనప్పటికీ టీమిండియాలో ప్రధాన బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు చోటు దక్కించుకుంటూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో పేస్ కు అనుకూలించే పిచ్ లపై స్వింగ్ బౌలర్ గా పేరున్న భువనేశ్వర్ కుమార్, వైవిధ్యమైన బంతులతో ఆసీస్ ను ఉక్కిరిబిక్కిరి చేయగలడని పేరున్న ఇషాంత్ శర్మ, వేగమే ఆయుధంగా బౌలింగ్ చేసే ఉమేష్ యాదవ్ రాణిస్తారని బీసీసీఐ సెలెక్టర్లు ఆశించారు. బ్యాట్స్ మన్ సమర్థవంతంగా రాణించినప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ లో బౌలర్ల వైఫల్యంతోనే టీమిండియా సిరీస్ కోల్పోయింది. దీంతో టీట్వంటీల్లో కొత్త బౌలర్లతో టీమిండియా రంగప్రవేశం చేసింది. వైవిధ్యం, వేగం, స్వింగ్, వికెట్ టు వికెట్ బంతులతో ఆసీస్ బ్యాట్స్ మన్ ను టీమిండియా కొత్త బౌలర్లు, స్పిన్నర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. అంతటితో ఆగకుండా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. దీంతో ఇంతవరకు సిరీస్ లలో పెద్దదిక్కులా వ్యవహరించే వీరి స్థానాలు మారిపోయాయి. కొత్త, పాత మేలు కలయికతో టీమిండియా కొత్త రూపం సొంతం చేసుకుంది. బుమ్రా, రిషి ధావన్, స్రాహ, హార్డిక్ పాండ్య, నేగిల ధాటికి ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, రంజీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో టీమిండియాలో మరోసారి బెర్తు దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్న ఇర్ఫాన్ పఠాన్ పెవిలియన్ కే పరిమితంకాక తప్పలేదు.