: ఫరీదాబాద్ లో దారుణం...సోషల్ మీడియాలో వైరల్


హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదలైన ఓ సీసీ టీవీ పుటేజ్ లో నలుగురు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా, క్రూరంగా కొట్టడం జరిగింది. ఆ దెబ్బలకు అచేతనావస్థలో పడిపోయిన సదరు బాదితుడ్ని ఇంకా కసితీరా బెల్టులతో దారుణంగా కొట్టారు. అంతేకాదు, ఆ నలుగురిలో ఓ వ్యక్తి బాధితుడిపై మూత్ర విసర్జన చేయగా, మరో వ్యక్తి అక్కడే ఆగిఉన్న ద్విచక్ర వాహనాన్ని తెచ్చి అతనిపై పడేశాడు. దానిని చూసిన ఆ వాహన యజమాని అతనిపై నుంచి ఆ వాహనాన్ని తీసేశాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ అవుతోంది. కాగా, బీడీ అడిగిన పాపానికి మానవత్వాన్ని మరచిన ఆ దుండగులు అతనిని అంతగా హింసించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News