: ముద్రగడ దీక్షలో న్యాయం ఉంది: వీహెచ్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మద్దతు తెలిపారు. ఆయన చేస్తున్న దీక్షలో న్యాయం ఉందన్నారు. కేసులకు భయపడేది లేదని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లతో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూనే సీఎం చంద్రబాబు మరోవైపు బీసీలను కావాలని రెచ్చగొడుతున్నారని వీహెచ్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.