: ఢిల్లీలో ఐఎస్ సానుభూతిపరుడు అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో ఐఎస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్టు చేశారు. రూర్కీ ఐఎస్ సానుభూతిపరులకు అతను ఆర్థికసాయం చేస్తున్నట్టు గుర్తించారు. అంతేగాక సిరియా ఉగ్రవాదులతోనూ సంబంధాలు నెరపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనితో కలిపి ఇప్పటివరకు ఐదుగురు ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.