: అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ... రూ.1,000 కోట్లతో ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆప్ హెల్త్ సైన్సెస్
నవ్యాంద్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సింగిల్ ఇటుకే పడలేదు. అప్పుడే పెద్ద సంఖ్యలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విద్యా సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశంలోనే అగ్రగామి వైద్య విద్యా సంస్థగా పేరుగాంచిన అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కు శంకుస్థాపన జరిగింది. తాజాగా దాదాపు రూ.1,000 కోట్లతో అన్ని హంగులతో ‘ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విశాఖలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయిన బ్రిటన్ ప్రతినిధి బృందం ఈ మేరకు ఓ ప్రతిపాదన చేసింది. ఈ విద్యా సంస్థ కోసం వంద ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరింది. దీనికి సంబంధించి త్వరలోనే ఒప్పందం కుదరనున్నట్లు సమాచారం.