: తొలిరోజు షూటింగ్ సెట్స్ లో దీపిక, విన్ డీజిల్


బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె మొదటిసారి చేస్తున్న హాలీవుడ్ చిత్రం 'xXx ద రిటర్న్ ఆఫ్ ద జాండర్ కేజ్' షూటింగ్ మొదలైంది. ఇందుకోసం ఇప్పటికే దీపిక టొరంటో వెళ్లిన సంగతి తెలిసిందే. తొలిరోజు షూటింగ్ సెట్స్ లో తీసిన దీపిక, విన్ డీజిల్ ఫస్ట్ లుక్ బయటికొచ్చింది. విన్ డిజల్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వార్ దీనిని పోస్టు చేశాడు. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ ఫోటోను పలువురు లైక్ చేస్తున్నారు. ఈ సినిమాలో దీపిక సెరీనాగా, డీజిల్ జాండర్ గా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News