: ఐఎస్ మరో ఘాతుకం... పదేళ్ల బాలుడితో బందీ కుత్తుక కోయించిన వైనం


ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) దారుణాలకు అంతే లేకుండా పోతోంది. తమకు ఎదురుతిరిగిన వారిని అత్యంత దారుణంగా హత్య చేస్తూ వస్తున్న ఆ ఉగ్రవాద సంస్థ తాజాగా మరో ఘాతుకానికి తెగబడింది. ఏది తప్పో, ఏది ఒప్పో తెలియని ముక్కుపచ్చలారని పిల్లల చేత హత్యలు చేయిస్తూ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. 17 నిమిషాల నిడివి ఉన్న తాజా వీడియోలో ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతున్న పదేళ్ల బాలుడు, ఐఎస్ బందీగా పట్టుకున్న ఓ వ్యక్తిని అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుని వచ్చి కెమెరా ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, ఆ వెనువెంటనే అతడి కుత్తుకను పెద్ద కత్తితో తెగ్గోశాడు. ఆ బాలుడిని అమెరికా దాడుల్లో చనిపోయిన ఐఎస్ ఫైటర్ అబూ దర్దా కుమారుడిగా భావిస్తున్నారు. బందీ గొంతును అవలీలగా కోసేసిన సదరు బాలుడు అమెరికాకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు.

  • Loading...

More Telugu News