: అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్త హత్య
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త రమణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆత్మకూరు మండల కేంద్రానికి సమీపంలోని పంటపొలాల్లో నిన్నరాత్రి అతను హత్యకు గురయ్యాడు. ఈరోజు ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు రమణ మృతదేహాన్ని గుర్తించి, తమకు తెలియజేశారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, టీడీపీ కార్యకర్త రమణ స్వస్థలం కల్యాణదుర్గం మండలంలోని ముసికొట్టాల తాండా.