: పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్ ప్రెస్... 100 మందికి పైగా గాయాలు
భారతీయ రైల్వేల చరిత్రలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కన్యాకుమారి- బెంగళూరుల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఐలాండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. తమిళనాడులోని జాలార్ పేట- పర్చూర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం నేటి తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన ఐదు బోగీలు ఓ పక్కకు ఒరిగిపోయాయి. దీంతో సదరు బోగీల్లోని చాలా మందికి గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం వంద మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.