: పురానాపూల్ లో మరికాసేపట్లో రీపోలింగ్... ఎన్నికల విధులకు దూరంగా సౌత్ జోన్ డీసీపీ


గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా పురానాపూల్ డివిజన్ లో మరికాసేపట్లో (ఉదయం 7 గంటలకు) రీపోలింగ్ ప్రారంభం కానుంది. మొన్న ఎన్నికల వేళ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ పై మజ్లిస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీపై పిడిగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో అక్కడ యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఎన్నికల కమిషన్ పురానాపూల్ లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. మరికాసేపట్లో పురానాపూల్ లోని మొత్తం 36 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఎన్నికల విధుల నుంచి దక్షిణ మండల డీసీీపీ సత్యనారాయణను తప్పించాలని నగర పోలీస్ కమిషనర్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొన్నటి గొడవలో పోలీసుల వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ సత్యనారాయణను ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News