: దీక్ష విరమించుకోవాలని ‘ముద్రగడ’ను కోరనున్న నేతలు!


కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ రేపటి నుంచి కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేపట్టనున్న కాపు నేత ముద్రగడ పద్మనాభంను విరమించుకోవాలని కోరేందుకు టీడీపీ నేతలు బోండా ఉమ, తోట త్రిమూర్తులు బయలుదేరారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, ముద్రగడతో చర్చలు జరిపేందుకు వెళ్లటం లేదని, కేవలం దీక్ష విరమించుకోవాలని కోరడానికే అక్కడికి వెళుతున్నామని అన్నారు. కమిషన్ ద్వారా చట్టబద్ధత కల్పించడం ద్వారానే బీసీలకు రిజర్వేషన్ కల్పించడం సాధ్యమని.. ఇదే విషయాన్ని ముద్రగడకు చెబుతామని అన్నారు.

  • Loading...

More Telugu News