: బాలీవుడ్ నిర్మాతపై పోలీసు కేసు!


మోడల్ గా పని చేస్తున్న ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై బాలీవుడ్ నిర్మాత సురేశ్ మెహతాపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సినిమాల్లో నటించే అవకాశమిస్తానని చెప్పి ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి రమ్మని సదరు యువతిని మెహతా పిలిచాడు. ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత మద్యం తాగించి తనపై అఘాయిత్యం చేయబోయాడని ఆమె ఆరోపించిందని శాంతాక్రజ్ పోలీసులు పేర్కొన్నారు. నిర్మాత మెహతా పరారీలో ఉన్నాడని, ఈ కేసు విషయమై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News