: రేపు క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహ నిశ్చితార్ధం


క్రికెటర్ రవీంద్ర జడేజా ఓ ఇంటివాడు కానున్నాడు. రాజ్ కోట్ కు చెందిన రీవా సోలంకి అనే 25 ఏళ్ల యువతితో అతనికి రేపు నిశ్చితార్ధం జరగనుంది. ఈ కార్యక్రమం జడేజా సొంత రెస్టారెంట్ జడ్డూస్ ఫుడ్ లైఫ్ లో జరుగుతుంది. రీవా తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి రాజ్ కోట్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. రీవా కూడా అక్కడే 'ఆత్మీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్'లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. గత కొన్ని నెలలుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కోసం ఢిల్లీలో ఉంటోంది.

  • Loading...

More Telugu News