: ప్రభుత్వంతో చర్చలకు నేను సిద్ధమే: ముద్రగడ


ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తన తరపున ఎవరూ వెళ్లలేదని 'కాపు నేత' ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఒకవేళ ఎవరొచ్చి మాట్లాడినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. ఒకవేళ చర్చల్లో తమ జాతికి న్యాయం జరుగుతుందని అనిపిస్తే నిర్ణయం తీసుకుంటానన్నారు. రిజర్వేషన్ల కోసమే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. తమ జాతికి న్యాయం కోసమే పోరాటం చేస్తున్నామని, ఇతరులను బాధపెట్టాలన్న ఉద్దేశం లేదని ముద్రగడ తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు తన దీక్ష మొదలవుతుందని చెప్పారు. తాను, తన శ్రీమతి దీక్షలో కూర్చుంటామన్నారు. దీక్షకు ఎవరూ తండోపతండాలుగా రావొద్దని, ఎవరికి వారు వీధుల్లో నిరసన తెలపాలని ముద్రగడ కోరారు.

  • Loading...

More Telugu News