: 'బాహుబలి 2' షూటింగులో ఏనుగు... దర్శక నిర్మాతలపై 'యానిమల్ టాస్క్ ఫోర్స్' ఆగ్రహం


ఇటీవల కేరళలోని త్రిసూర్ లో రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి 2' షూటింగు జరిగింది. ఈ షూటింగులో ఓ ఏనుగుపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు సమాచారం. దాంతో ఈ చిత్ర బృందంపై జంతు హక్కుల పరిరక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా దర్శకుడు, నిర్మాతలను అరెస్టు చేయాలని 'యానిమల్ టాస్క్ ఫోర్స్' బృందం డిమాండ్ చేసింది. భారత వన్యమృగ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సినిమాలో ఏనుగును షూటింగు కోసం ఉపయోగించారని వారు ఆరోపిస్తున్నారు. షూటింగు జరుగుతున్నంతసేపు యూనిట్ సభ్యుల అరుపులు, కేకల వల్ల ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం వెల్లడించారు. ఈ క్రమంలో వన్యమృగాల చట్టం-2001లోని నియమాలను వారు ఉల్లంఘించారని చెబుతున్నారు. అందుకే ఈ సినిమా దర్శక, నిర్మాతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఆదేశించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరామని తెలిపారు.

  • Loading...

More Telugu News