: రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తుంటే, కేంద్ర మంత్రుల నుంచి ప్రశంసలందుకుంటున్న కేటీఆర్!


తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ను రాష్ట్రంలోని బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు విమర్శిస్తుంటే, కేంద్ర మంత్రులు మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ సర్కారు చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు డబ్బు దోచిపెట్టేందుకేనని కిషన్ రెడ్డి, నాగం జనార్దనరెడ్డి వంటి నేతలు విమర్శిస్తున్న వేళ, కేంద్ర మంత్రి వీరేంద్ర సింగ్ ఆయనిచ్చిన వాటర్ గ్రిడ్ ప్రజెంటేషన్ చూసి ముగ్ధుడైపోయారు. నిన్న ముంబైలో జరిగిన ఓ సమావేశంలో వాటర్ గ్రిడ్ పై తాను స్వయంగా తయారు చేసుకున్న పవర్ పాయింట్ ప్రదర్శనను ఆయన నేతల ముందుంచగా, దాన్ని చూసిన అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కరవు ప్రాంతాల్లో ఈ తరహా పథకాలు నీటి కొరతను తీరుస్తాయని వీరేంద్ర వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు భాషపై మంచి పట్టుందని, అనుకున్నదాన్ని స్పష్టంగా చెప్పగలనని నిరూపించారని, చేసి చూపిస్తారని భావిస్తున్నానని అన్నారు. కాగా, ఇకపై బీజేపీ నేతలు మిషన్ భగీరథను విమర్శించాలంటే మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, కేంద్ర మంత్రి పొగిడిన విషయాన్ని టీఆర్ఎస్ శ్రేణులు వాడుకుంటూ, బీజేపీ నేతల విమర్శలను తిప్పి కొడతాయి కాబట్టి. ఇది స్థానిక బీజేపీ నేతలకు ఒకింత ఇబ్బందికర విషయమే.

  • Loading...

More Telugu News