: ఉత్తమ్, షబ్బీర్ లపైనా కేసులు నమోదు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై మీర్ చౌక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా విధించిన ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలతో బాటు, పాతబస్తీలోని పురానాపూల్ లో జరిగిన దాడి ఘటనలో వారిద్దరూ తమను దుర్భాషలాడారని ఎంఐఎం కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. దాంతో 143, 147, 148, 506, రెడ్ విత్ 37 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారని తెలిసింది. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నిన్న(బుధవారం) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.