: తెలంగాణ ఏజీకి హైకోర్టు మొట్టికాయ... ఏపీ పునర్విభజన చట్టాన్ని చదువుకుని రావాలని హితవు


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీసియో చట్టానికి మార్పులు చేయడాన్ని నిన్న హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొద్దిసేపటి క్రితం మరోమారు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తనదైన శైలిలో దూసుకుపోయారు. చట్టం చేసిన రెండేళ్లలోపు దానికి ఎన్నిసార్లైనా సవరణ చేసే వీలుందని చేసిన ఏజీ వాదనతో ధర్మాసనం విభేదించింది. చట్టానికి ఒకసారి మాత్రమే సవరణ చేసే అవకాశముందని, అయినా ఏపీ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ఏజీకి కోర్టు మొట్టికాయ వేసింది. ఈసారైనా కోర్టుకు వచ్చేటప్పుడు విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకుని రావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆగ్రహంతో ఏజీ నోట మాట రాలేదు.

  • Loading...

More Telugu News