: ఇప్పటికిప్పుడు సమాధానం లేని ప్రశ్నిది: కాపు రిజర్వేషన్లపై జస్టిస్ మంజునాథ్


బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న ప్రశ్నకు తన వద్ద ఇప్పటికిప్పుడు సమాధానం లేదని జస్టిస్ మంజునాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ముఖ్యమంత్రితో సమావేశమైన ఆయన మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు 9 నెలల గడువుందని, వీలైనంత వరకూ గడువులోగా రిపోర్టు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి చైర్మన్ హోదాలో ప్రభుత్వం నియమించిన కమిటీలో తానొక్కడినే ఉన్నానని, ఇంకా సభ్యుల ఎంపిక జరగాల్సి వుందని తెలిపారు. ఆ తరువాత మాత్రమే తమ పని ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. తమ విచారణలో భాగంగా కాపు అనుకూల, వ్యతిరేక వాదనలన్నీ వింటామని తెలిపారు.

  • Loading...

More Telugu News