: నన్ను పదవి నుంచి దించాలని సోలార్ స్కామ్ కుట్ర చేశారు: సీఎం ఊమన్ చాందీ
కేరళలో సంచలనం రేపిన సోలార్ స్కామ్ ను ముఖ్యమంత్రి ఊమన్ చాందీ ఓ ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. ఇందులో తనను ఇరికించేందుకు ఇది వామపక్ష కూటమి, లిక్కర్ లాబీ చేస్తున్న కుట్రేనని అన్నారు. తనను పదవి నుంచి దించాలని ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారి బెదిరింపులకు తాను భయపడేదిలేదని చాందీ స్పష్టం చేశారు. అంతేగాక తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పరిధిలో ఉందని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ స్కామ్ లో తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. వచ్చే ఏడాది జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి తప్పక విజయం సాధిస్తుందని, అధికారాన్ని నిలబెట్టుకుంటామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.