: తెగిన లిఫ్ట్... ఆళ్ల నానికి తప్పిన పెను ప్రమాదం!


పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి ఈ ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ ఐదవ అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళుతుండగా, ప్రమాదం జరిగింది. లిఫ్ట్ కింద పడ్డ తరువాత గ్రిల్స్ ను కట్ చేసి ఆయన్ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. తనకేమీ పెద్ద గాయాలు కాలేదని, క్షేమంగానే ఉన్నానని నాని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News