: బాలకృష్ణపై ఈసీకి ఫిర్యాదు.. ఏపీ ఎమ్మెల్యేగా ఉండి గ్రేటర్ లో ఎలా ఓటేస్తారంటున్న పొన్నం


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలంగాణ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ టీకాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ లో ఓటరుగా ఉన్న బాలయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు రోజుల పాటు సైలెంట్ గా ఉన్న పొన్నం తాజాగా నేటి ఉదయం ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తున్న అంశంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News