: ఇక కాపు వర్సెస్ బీసీ!... ఏపీలో సరికొత్త యుద్ధం


ఏపీలో కాపులకు రిజర్వేషన్ల పేరిట కొత్తగా తెరపైకి వచ్చిన డిమాండ్ కొత్త యుద్ధానికి తెర తీసింది. నిన్నటిదాకా ప్రభుత్వంపై కాపులు దండయాత్ర చేస్తే... తాజాగా ఆ సామాజిక వర్గం బీసీలతో యుద్ధానికి దిగక తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో కాపు నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఐక్య గర్జనకు లక్షలాదిగా తరలివచ్చిన కాపులు ఆ తర్వాత బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కాపుల ఉద్యమంపై చర్చ మరింత విస్తృతమైంది. ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న 25 శాతం రిజర్వేషన్లలో కొంత కోటాను చీల్చి కాపులకు ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో బీసీలు రంగ ప్రవేశం చేశారు. కాపు ఉద్యమాలకు వ్యతిరేకంగా ఏపీలోని ప్రధాన పట్టణాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీసీ సంఘాలు నడుం బిగించాయి. ఈ మేరకు నిన్న విజయవాడలో ఒకే వేదికపైకి వచ్చిన బీసీ సంఘాలన్నీ కాపులపై సమర భేరీని మోగించాయి. అసలు కాపులకు బీసీ ట్యాగెందుకంటూ బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్వరం పెంచారు. తమ కోటాలో కోత విధిస్తే, చూస్తూ ఊరుకోబోమని ఆయన ఏపీ సర్కారుకు తెగేసి చెప్పారు. ఇదే క్రమంలో కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా కొద్దిసేపటి క్రితం కాకినాడలోని తూర్పు గోదావరి కలెక్టర్ కార్యాలయాన్ని వందలాది మంది బీసీలు ముట్టడించారు.

  • Loading...

More Telugu News