: దిగి రామంటున్న ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికులు... జంగ్ తో భేటీకి సిసోడియా యత్నం


వేతన బకాయిల కోసం సమ్మె బాట పట్టిన ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన విరమించేందుకు ససేమిరా అంటున్నారు. తమకు బకాయి పడ్డ వేతనాలను చెల్లించేదాకా సమ్మె విరమించబోమని చెప్పిన కార్మికులు... నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.551 కోట్ల విడుదలకు సిద్ధమైనా, సమ్మె విరమణకు ససేమిరా అంటున్నారు. దీంతో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రంగంలోకి దించిన కేజ్రీ, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో భేటీకి రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో సిసోడియా నేడు నజీబ్ జంగ్ తో భేటీ కానున్నట్లు సమాచారం. అంతేకాక కార్మికులకు వేతనాలు చెల్లించని కార్పొరేషన్ల మేయర్లతోనూ భేటీ అయ్యేందుకు సిసోడియా యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News