: ‘హెరాల్డ్’ కేసులో సుప్రీం గడప తొక్కిన సోనియా, రాహుల్
తమను కోర్టు మెట్లెక్కించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కొడుకు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమపై అభియోగాలను రద్దు చేయాలన్న వారి వాదనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే సోనియా, రాహుల్ లతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ జరిగే నాటికి ఈ కేసు నుంచి బయటపడాలన్న యోచనతోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారిద్దరూ సుప్రంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరి అక్కడైనా వారికి ఊరట కలుగుతుందో, లేదో చూడాలి!