: షారూక్, అమీర్ మాట్లాడేందుకే భయపడుతున్నారు! : సోనమ్ కపూర్
బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లు మాట్లాడేందుకే భయపడుతున్నారని హీరోయిన్ సోనమ్ కపూర్ అంటోంది. "ఒక్కసారి ఊహించుకోండి... షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు మాట్లాడినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో! ఇకపై ఈ వ్యతిరేక స్పందనలు చూసి వారు మాట్లాడేందుకే భయపడతారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అది మంచైనా, చెడైనా, వారి వాక్ స్వాతంత్రపు హక్కు వారిదే. అభిప్రాయాలు తెలిపేవారికి మద్దతుగా నిలవాలి" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఇక మతపరమైన అసహనం దేశాన్ని వెనక్కు తీసుకెళుతుందని అభిప్రాయపడింది. గత సంవత్సరం ఇండియాలో అసహనం పెరిగిపోయిందని, తన భార్య ఇక్కడ ఉండవద్దని చెబుతోందని అమీర్ వ్యాఖ్యానించిన వేళ, తీవ్ర రాద్ధాంతం జరిగిన సంగతి తెలిసిందే.