: మెగాస్టార్ కు నేడు ఆపరేషన్... ఏర్పాట్లు పూర్తి!


తన భుజానికి అయిన గాయానికి మెగాస్టార్ చిరంజీవి నేడు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆపరేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు తెలుస్తోంది. తన 150వ సినిమాగా తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని ఎంచుకున్న ఆయన, షూటింగ్ ప్రారంభమయ్యే ముందే ఈ ఆపరేషన్ ముగించేసుకోవాలని భావించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, చిరు వెంట ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. ఆపరేషన్ ముగిసిన తరువాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నాకనే చిరంజీవి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News