: ‘పఠాన్ కోట్’ ఎఫెక్ట్!... వెస్టర్న్ కమాండ్ ఎయిర్ బేస్ లలో ‘షూట్ ఎట్ సైట్’ ఆర్డర్స్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై గత నెల 2న జరిగిన ఉగ్రవాదుల దాడితో ఉత్తర భారతం (వెస్టర్న్ కమాండ్)లోని వైమానిక స్థావరాలన్నింటిలో ‘కనిపిస్తే కాల్చివేత (షూట్ ఎట్ సైట్)’ ఆదేశాలు జారీ అయ్యాయి. దాయాదీ దేశం పాకిస్థాన్ భూభాగంలో తిష్ట వేసిన ఉగ్రవాదులు వైమానిక దళాలను టార్గెట్ చేశారన్న సమాచారంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎయిర్ బేస్ ఫెన్సింగ్ ఎక్కేందుకు సాహసించినా, ఎయిర్ బేస్ లోకి అనుమతి లేకుండా ప్రవేశించేందుకు యత్నించినా ఆయా వ్యక్తులను అక్కడికక్కడే కాల్చివేసేలా ఆదేశాలు జారీ చేశామని భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు నిన్న చెప్పారు. ఎయిర్ బేస్ లకు 100 మీటర్లు, ఆయుధ డిపోలకు 900 మీటర్ల దూరంలో ఎలాంటి కట్టడాలకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని కూడా సదరు అధికారి చెప్పారు.