: లాలూ అల్లుడి కారు చోరీ... పట్టపగలు తుపాకులు చూపి ఎత్తుకెళ్లిన దుండగులు


ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడి ఫార్చూనర్ కారు పట్టపగలు చోరీకి గురైంది. కారు డ్రైవర్ ను తుపాకులతో బెదిరించిన ఇధ్దరు దుండగులు అతడి చేతిలోని తాళాలు లాక్కుని ఎంచక్కా కారును తీసుకెళ్లారు. ఈ ఘటన నిన్న గుర్ గావ్ సమీపంలోని సికిందర్ పూర్ లో చోటుచేసుకుంది. వ్యక్తిగత పని నిమిత్తం లాలూ ఐదో అల్లుడు వినీత్ యాదవ్ నిన్న గుర్ గావ్ వెళ్లారు. అక్కడ పని ముగించుకుని సికిందర్ పూర్ చేరుకున్నారు. అక్కడ వినీత్ కారు దిగగా, ఓ పక్కగా దానిని డ్రైవర్ పార్క్ చేశాడు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి డ్రైవర్ పై దాడి చేసినంత పనిచేశారు. తుపాకులు తీసి ఎక్కుపెట్టి డ్రైవర్ నుంచి తాళాలు లాక్కున్న దుండగులు ఎంచక్కా కారెక్కేసి వెళ్లిపోయారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News