: 200 దాటిన బంగ్లా మృతుల సంఖ్య
పొరుగుదేశం బంగ్లాదేశ్ లో నిన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య సముదాయం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 204కి చేరింది. ప్రమాదానికి గురైన సందర్భంలో ఈ భవంతిలో 3000 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బంగ్లా పోలీసు వర్గాలు తెలిపాయి.